విద్యుత్‌ చోరీకి పాల్పడితే నాన్‌బెయిలబుల్‌ కేసులు

ABN , First Publish Date - 2020-12-29T05:20:34+05:30 IST

విద్యుత్‌ చౌర్యానికి పాల్పడితే నాన్‌బెయిలబుల్‌ కేసులు పెడతామని విద్యుత్‌ విజిలెన్స్‌ తిరుపతి ఎస్‌ఈ వి.సురేష్‌కుమార్‌ హెచ్చరించారు.

విద్యుత్‌ చోరీకి పాల్పడితే నాన్‌బెయిలబుల్‌ కేసులు
మీటర్లను పరిశీలిస్తున్న విజిలెన్స్‌ ఎస్‌ఈ సురేష్‌

విద్యుత్‌ విజిలెన్స్‌ ఎస్‌ఈ సురేష్‌


ఎర్రగుంట్ల, డిసెంబరు 28: విద్యుత్‌ చౌర్యానికి పాల్పడితే నాన్‌బెయిలబుల్‌ కేసులు పెడతామని విద్యుత్‌ విజిలెన్స్‌ తిరుపతి ఎస్‌ఈ వి.సురేష్‌కుమార్‌ హెచ్చరించారు. సోమవారం ఎర్రగుంట్ల లోని నాపరాయి గనులు, పరిశ్రమలు, ఇతర వాటిల్లో కడప, కర్నూలు, అనంతపురం, తిరుపతి, నెల్లూరుకు చెందిన విద్యుత్‌ అధికారులు, విజిలెన్స్‌ అధికారులు, పోలీసులతో కలిసి 35 టీంలుగా ఏర్పడి తనిఖీలు చేశామని తెలిపారు. గనుల్లో, ఇతర చోట్ల విద్యుత్‌ వాడకంపై తమకు ఫిర్యాదులు రావడంతో తనిఖీలు నిర్వహించామన్నారు. భవిష్య త్‌లో ఎవరు కూడా విద్యుత్‌ చౌర్యానికి పాల్పడకుండా అందరూ సహకరించాలన్నారు. విద్యుత్‌ లోడ్‌ ఎక్కువ వుంటే అదనపు లోడ్‌ కోసం డబ్బులు చెల్లిస్తే వెంటనే తమ అధికారులు ఏర్పాట్లు చేస్తారన్నారు. ముఖ్యంగా రెండు రకాల విద్యుత్‌ చోరీ జరుగుతోందన్నారు. నేరుగా కొక్కీలు తగిలించుకుని విద్యుత్‌ను దొంగిలించడం,  మీటర్‌ వద్ద అనేక అక్రమాలకు పాల్పడం అని ఆయన వివరించారు. టౌన్‌లో 15, రూరల్‌లో 20 టీంలు పర్యటించి 454 సర్వీసులను తనిఖీ చేసినట్లు ఆయన వివరించారు. బ్యాక్‌ బిల్లింగ్‌ కేసులు, అడిషనల్‌ లోడ్‌ తదితర వాటికి సం బంధించి మొత్తం రూ.8.4 లక్షలు వసూలు చేస్తున్నట్లు ఎస్‌ఈ వివరించారు.  విజిలెన్స్‌ సీఐ డి.బాస్కర్‌రెడ్డి, ఈఈ చంద్రశేఖర్‌రెడ్డి, ఏడీఈ లక్ష్మీనరసింహారెడ్డి, ఏఈలు, సిబ్బంది ఈదాడుల్లో పాల్గొన్నట్లు ఎస్‌ఈ తెలిపారు.

Updated Date - 2020-12-29T05:20:34+05:30 IST