వైఎస్‌ జార్జిరెడ్డికి ఘన నివాళి

ABN , First Publish Date - 2020-12-08T05:08:55+05:30 IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సోదరుడు వైఎస్‌ జార్జిరెడ్డి వర్దంతి కార్యక్ర మాన్ని కుటుంబ సభ్యులు, అభిమానులు నిర్వహించారు.

వైఎస్‌ జార్జిరెడ్డికి ఘన నివాళి
వైఎస్‌ జార్జిరెడ్డి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్‌ విజయలక్ష్మి

పులివెందుల టౌన్‌, డిసెంబరు 7: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సోదరుడు వైఎస్‌ జార్జిరెడ్డి వర్దంతి కార్యక్ర మాన్ని కుటుంబ సభ్యులు, అభిమానులు నిర్వహించారు. ఈసం దర్భంగా జార్జిరెడ్డి సమాధి వద్ద మాజీ ఎమ్మెల్యే వైఎస్‌ విజయలక్ష్మి, జార్జిరెడ్డి సతీమణి వైఎస్‌ భారతమ్మ, వైఎస్‌ కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళులర్పించారు. ఈ సందర్భం గా ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రత్యేక ప్రార్థన లు నిర్వహించారు. అలాగే బాకరాపురంలోని వైఎస్‌ జార్జిరెడ్డి ఐటీఐ కళాశాలలో జార్జిరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దివ్యాంగులకు దుస్తులు పంపిణీ చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-08T05:08:55+05:30 IST