కరోనా కట్టడికి వచ్చే వారం కీలకం
ABN , First Publish Date - 2020-04-25T08:48:24+05:30 IST
కరోనా వైరస్ నివారణకు వచ్చే వారం రోజులు అత్యంత కీలకమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పేర్కొన్నారు.

కడప (కలెక్టరేట్), ఏప్రిల్ 24: కరోనా వైరస్ నివారణకు వచ్చే వారం రోజులు అత్యంత కీలకమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడ నుంచి కోవిడ్ -19 నియంత్రణపై జిల్లా కలెక్టర్లు, జేసీలతో సమావేశం నిర్వహించారు. అత్యవసర వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారితో ప్రైమరీ కాంట్రాక్ట్ ఉన్నవారందరికీ కరోనా పరీక్షలు చేయాలన్నారు. కలెక్టర్ హరికిరణ్, జిల్లా కోవిడ్ జిల్లా ప్రత్యేకాధికారి శశిభూషణకు మార్, జాయింట్ కలెక్టర్ గౌతమి,,జేసి-2 శివారెడ్డి, శిక్షణ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ తదితరులు పాల్గొన్నారు.