కడపలో కొత్త శాసనం

ABN , First Publish Date - 2020-02-16T09:29:16+05:30 IST

కడప నగర శివార్లలోని మక్తుంసాహెబ్‌కొట్టాలు గ్రా మంలో ఉన్న కాలభైరవ స్వామి దేవాలయం

కడపలో కొత్త శాసనం

కనుగొన్న ఈమని శివనాగిరెడ్డి


కడప, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): కడప నగర శివార్లలోని మక్తుంసాహెబ్‌కొట్టాలు గ్రా మంలో ఉన్న కాలభైరవ స్వామి దేవాలయం సమీపాన క్రీ.శ.10వ శతాబ్దం నాటి శాసనం దొరికిందని చరిత్ర పరిశోధకులు, స్థపతి, కల్చ రల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ మరియు అమ రావతి సీఈవో శివనాగిరెడ్డి తెలిపారు. శని వారం ఆయన ఈ ఆలయాన్ని సందర్శించా రు. ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయం వ ద్ద పగిలిపోయిన శాసనం ఉందని, అందులో ‘సమీయం ఆదిత్య’ అని ఒక పంక్తిలోనూ, ‘త్రవే ఆదిత్య’ అని రెండో పంక్తిలోనూ చెక్కి ఉందని అన్నారు. ఈ శాసనాన్ని కడప మ్యూ జియంలో భద్రపరచాలని కోరారు. కాల భైరవ స్వామి పరిసరాల్లో జరిపిన అన్వేషణలో కీ.శ. 9, 10 శతాబ్దాల నాటి భిన్నమయిన కాల భైర వేశ్వర విగ్రహం, వాహనాలపై సప్తమాతల శిల్పం, క్రీ.శ.16వ శతాబ్దానికి చెందిన మరో కాలభైరవ శిల్పం, నంది శిల్పం ఆలయం వెలుపల పడిఉన్నాయన్నారు. సప్తమాతలు వాహనాలు ఎక్కి స్వారీ చేస్తున్నట్టుగా ఉన్నారని ఇది చాలా అరుదైన విగ్రహమని చెప్పారు. చారిత్రక ప్రాధాన్యత గల శిల్పాలను కాపాడాలని పురావస్తుశాఖ అధికారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.


మబ్బు దేవాలయాన్ని పరిరక్షించాలి

వల్లూరు గ్రామ సమీపంలో ఉన్న మబ్బు దేవాలయాన్ని పరిరక్షించాలని చరిత్ర పరిశో ధకులు ఈమని శివనాగిరెడ్డి కోరారు. ఆలనా పాలనా లేక ఆలయం నానాటికీ శిధిలావస్థకు చేరుకోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం యోగివేమన విశ్వవిద్యాల య పూర్వపు ప్రత్యేక అధికారి శివారెడ్డితో కలసి ఆయన మబ్బుదేవాలయాన్ని పరిశీలిం చారు. ఆయన మాట్లాడుతూ కాకతీయుల సామంతరాజైన కాయస్థ అంబదేవుడు ఒకప్పు డు వల్లూరును రాజధానిగా చేసుకుని పరి పాలన చేశారని అన్నారు. 13వ శతాబ్దంలో అంబదేవుడు, ఆయన పూర్వీకులు ఈ ఆల యాన్ని కట్టించారని అన్నారు. ఈ ఆలయంపై భాగవత సంఘటనలను శిల్పాలుగా మలిచిన తీరు అద్భుతంగా ఉందన్నారు. దీనిని కాపాడి భవిష్యత్‌ తరాలకు అందించాలని కోరారు.

Updated Date - 2020-02-16T09:29:16+05:30 IST