-
-
Home » Andhra Pradesh » Kadapa » Navabupeta farmers
-
నవాబుపేట రైతుల సమస్య పరిష్కారం
ABN , First Publish Date - 2020-12-11T04:47:57+05:30 IST
దాల్మియా పరిశ్రమలో బ్లాస్టింగ్ వల్ల పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని ఐదు రోజులుగా నిరసన చేస్తున్న నవాబుపేట బాధిత రైతులు సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది.

మైలవరం, డిసెంబరు 10 : దాల్మియా పరిశ్రమలో బ్లాస్టింగ్ వల్ల పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని ఐదు రోజులుగా నిరసన చేస్తున్న నవాబుపేట బాధిత రైతులు సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. గురువారం ప్రజా ప్రతినిధులు, పోలీసు అధికారులు, గ్రామ పెద్దలతో చర్చలు జరిపారు. పంట నష్టం కలిగిన బాధితులకు నష్ట పరిహారం చెల్లించేందుకు దాల్మియా అధికారులు ఒప్పుకోవడంతో సమస్య పరిష్కారమైందని తెలుపడంతో పొలంలో వేసిన టెంట్‌లను తొలగించినట్లు బాధిత రైతులు తెలిపారు.