500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

ABN , First Publish Date - 2020-12-04T04:38:26+05:30 IST

వై.కోట అటవీ ప్రాంతంలోని సిద్దులగుట్ట ప్రాంతంలో డ్రమ్ములలో నిల్వ ఉంచిన 500 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు ఆయన వివరించారు.

500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

రైల్వేకోడూరు, డిసెంబరు 3: నియోజకవర్గంలోని ఓబులవారిపల్లె మండలం వై.కోట గ్రామ సమీప అడవుల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై గురువారం రైల్వేకోడూరు స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు, సిబ్బంది కలసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వేకోడూరు ఎస్‌ఈబీ అధికారి రామమోహన్‌ మాట్లాడుతూ వై.కోట అటవీ ప్రాంతంలోని సిద్దులగుట్ట ప్రాంతంలో డ్రమ్ములలో నిల్వ ఉంచిన 500 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు ఆయన వివరించారు. దాడుల్లో ఎస్‌ఈబీ హెడ్‌ కానిస్టేబుల్‌ మోహన్‌రెడ్డి, కానిస్టేబుళ్లు శివప్రసాద్‌, మురళి, రాజంపేట సబ్‌ డివిజనల్‌ స్పెషల్‌ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T04:38:26+05:30 IST