నాగమ్మ హత్య కేసు సీబీఐ చేత విచారణ జరిపించాలి

ABN , First Publish Date - 2020-12-28T05:48:54+05:30 IST

ఈనెల 8వ తేదీన లింగాల మండలం పెద్దకుడాలలో దళిత మహిళ నాగమ్మ హత్య కేసు సీబీఐ చేత విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. ఆదివారం పెద్దకుడాల గ్రామంలో హత్యకు గురైన నాగమ్మ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన వచ్చారు.

నాగమ్మ హత్య కేసు సీబీఐ చేత విచారణ జరిపించాలి
పెద్దకుడాలలో విలేకరులతో మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగ

మందకృష్ణ మాదిగ

లింగాల/ కడప (మారుతీనగర్‌), డిసెంబరు 27: ఈనెల 8వ తేదీన లింగాల మండలం పెద్దకుడాలలో దళిత మహిళ నాగమ్మ హత్య కేసు సీబీఐ చేత విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్‌ చేశారు. ఆదివారం పెద్దకుడాల గ్రామంలో హత్యకు గురైన నాగమ్మ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన వచ్చారు. అయితే ఆయన వచ్చేసరికి నాగమ్మ కుటుంబ సభ్యులు, 90 శాతం మంది దళితులు తమ ఇళ్లకు తాళాలు వేసి గ్రామంలో లేకుండా వెళ్లిపోయారు. ఆ చుట్టుపక్కల వారిని అడిగినా ఎవరూ సరైన సమాధానం చెప్పలేదు. దీంతో లింగాల పోలీ్‌సస్టేషనకు వచ్చి ఎస్‌ఐ హాజీవలిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెద్దకుడాల గ్రామంలో దళిత మహిళ నాగమ్మ హత్యకేసులో అసలైన దోషులను వదిలిపెట్టి ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేని వారిపై కేసు పెట్టారన్నారు. రాజకీయ ఒత్తిళ్లు ఉండడం వలనే నాగమ్మ హత్య కేసు నీరుగార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. హత్య చేసిన వారు అగ్రకులాలు వారు కాకపోతే మేము గ్రామంలోకి వచ్చే సమయంలో దళితులు గ్రామంలో లేకుండా ఎక్కడికి పంపించారన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని గ్రామాల్లో ఇలా హత్యలు దాడులు జరుగుతుంటే మిగతా వారికి రక్షణ ఎక్కడుందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రామాంజనేయులు, శివయ్య, జిల్లా అధ్యక్షులు కేఎన రాజు, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.


దాడులపై త్వరలో ఉద్యమం

రాష్ట్రంలో దళిత మహిళలపై అత్యాచారాలు, దాడులు పేట్రేగుతున్న దృష్ట్యా త్వరలో ఉద్యమానికి సన్నద్ధం అవుతున్నట్లు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఆదివారం స్థానిక ఆర్‌.అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో దళిత మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా సీఎం జగన ఏమాత్రం స్పందించకుండా మిన్నకుండడం దారుణమన్నారు. అత్యాచారానికి గురైన అగ్రవర్ణాల వారికి ఒక న్యాయం, దళితులకు ఒక న్యాయం అన్నట్లుగా జగన్‌రెడ్డి పాలన సాగిస్తున్న తీరు సరైంది కాదన్నారు. ఎస్సీ వర్గీకరణ పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  తన వైఖరేమిటో బహిరంగ పరచాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సమితి నాయకులు శివయ్య రాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T05:48:54+05:30 IST