నాడు-నేడు పనులపై అడ్వైజర్ అసంతృప్తి
ABN , First Publish Date - 2020-12-18T04:59:29+05:30 IST
జమ్మలమడుగు పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులపై అమరావతి నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారి, రాష్ట్ర అడ్వైజర్ మురళి అసంతృప్తి వ్యక్తం చేశారు.

జమ్మలమడుగు రూరల్, డిసెంబరు 17: జమ్మలమడుగు పాఠశాలల్లో జరుగుతున్న నాడు-నేడు పనులపై అమరావతి నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారి, రాష్ట్ర అడ్వైజర్ మురళి అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన పనులను ఆయన పరిశీలించారు. ముందుగా పైకప్పు వెంటిలేటర్ల నుంచి వర్షపునీరు పడితే విద్యార్థులకు సమస్యగా ఉంటుందని ఉపాధ్యాయులు తెలిపారు. ఆయన పరిశీలించి పాఠశాలలో పనులు గందరగోళంగా మారాయన్నారు. అక్కడి నుంచి పట్టణంలోని బీసీ కాలనీ పాఠశాలలో, గూడెం చెరువు గ్రామంలో, పతంగే రామన్నరావు హైస్కూలులో జరిగిన పనులను ఆయన పరిశీలించారు. గతంలో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, జిల్లా విద్యాశా ఖాధికారి శైలజ తదితర అధికారులు పరిశీలించినా నాడు-నేడు పనుల్లో మార్పు కానరాలేదని తెలుస్తోంది. ఎంఈవో సావిత్రి, హెటిరో సంస్థ అధికారులు పాల్గొన్నారు.