‘నాడు - నేడు’ ద్వారా విప్లవాత్మక మార్పులు

ABN , First Publish Date - 2020-09-06T09:10:08+05:30 IST

నాడు - నేడు కార్యక్రమం ద్వారా విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ

‘నాడు - నేడు’ ద్వారా విప్లవాత్మక మార్పులు

  • డిప్యూటీ సీఎం అంజద్‌ బాషా

కడప (ఎడ్యుకేషన్‌), సెప్టెంబరు 5 : నాడు - నేడు కార్యక్రమం ద్వారా విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా అన్నారు. స్థానిక మున్సిపల్‌ హైస్కూలులో శనివారం నాడు - నేడు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో మెగా డీఎస్సీ నిర్వహించి 17వేల మంది టీచర్ల భర్తీకి శ్రీకా రం చుట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ విద్యాభివృద్ధికి అత్యధికంగా నిధులు ఖర్చు చేస్తున్నారన్నారు. ప్రతి పాఠశాలలో టాయ్‌లెట్స్‌, రన్నింగ్‌ వాటర్‌, విద్యుత్‌, ప్రహరీ, గ్రీన్‌బోర్డ్స్‌, డ్రింకింగ్‌ వాటర్‌ సమకూర్చి ఆహ్లాదకర వాతావరణం ఏర్పాటు చేస్తున్నామన్నారు. భారత ప్రభు త్వ ఆదేశాల మేరకు అక్టోబరు 5 నుంచి పాఠశాలలు ప్రారంభమవుతాయన్నారు. విద్యాసామగ్రిని సీఎం అందిస్తున్నట్లు తెలిపారు.  


డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

కడప (ఎర్రముక్కపల్లె), సెప్టెంబరు 5 : కడప నగరపాలక సంస్థ పరిధిలో డ్రైనేజీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉప ము ఖ్యమంత్రి అంజద్‌బాషా అన్నారు. కడప డిప్యూటీ సీఎం క్యాంపు కా ర్యాలయంలో శనివారం మున్సిపల్‌ అధికారులు, హెల్‌ ్త అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కార్పొరేషన్‌ పరిఽధిలో జోన్‌ 3, 4 యూజీడీ నిర్మాణానికి మరమ్మతులకు సంబంధించి 121 కోట్లతో ప్రపోజల్‌ పంపిం చా మన్నారు. నిఽధులు మంజూరైన వెంటనే టెండర్లు పిలిచి పనులు పార్రంభించాలని పబ్లిక్‌ హెల్త్‌ ఆఫీసర్లకు సూచించారు. పట్టణంలో డ్రైనేజీ సమస్య రాకుండా ఎప్పటికప్పుడు అధికారులు చర్యలు చేప ట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయరు సురేష్‌బాబు, హెల్త్‌ ఎస్‌ఈ శ్రీనాథ్‌రెడ్డి, ఈఈ చెన్నకేశవరెడ్డి, ఏఈ యశోద, వైసీపీ నాయకులు అజ్మతుల్లా పాల్గొన్నారు.


జిల్లా క్రీడా హబ్‌గా అభివృద్ధి

కడప(స్పోర్ట్స్‌), సెప్టెంబరు 5: కడప జిల్లాను క్రీడాహబ్‌గా అభివృద్ధి చేస్తామని ఉప ముఖ్యమంత్రి అంజద్‌ బాషా అన్నారు. శనివారం మున్సిపల్‌, ఇండోర్‌ స్టేడియంలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయా స్టేడియంలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. మున్సిపల్‌ కమిషనరు లవన్న, స్టెప్‌ సీఈఓ డా.రామచంద్రారెడ్డి, హెల్త్‌ అధికారి శ్రీనివాసరెడ్డి, ఒలంపిక్‌  జిల్లా అధ్యక్షుడు సమరనాథ్‌రెడ్డి, సుభాన్‌ బాష, మైనార్టీ సెల్‌ నేత షఫి, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-09-06T09:10:08+05:30 IST