నాడు వాగ్దానాలు - నేడు వాయింపులు

ABN , First Publish Date - 2020-11-07T05:06:50+05:30 IST

వైసీపీ నవంబరు 6 నుంచి 16వ తేదీ వరకు ప్రజా చైతన్య కార్యక్రమం నిర్వహించడం విడ్డూరంగా ఉందని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు.

నాడు వాగ్దానాలు - నేడు వాయింపులు

‘ప్రజలతో నాడు- ప్రజల కోసం నేడు’పై తులసిరెడ్డి ఎద్దేవా

వేంపల్లె, నవంబరు 6: ప్రజలతో నాడు - ప్రజల కోసం నేడు అంటూ వైసీపీ నవంబరు 6 నుంచి 16వ తేదీ వరకు ప్రజా చైతన్య కార్యక్రమం నిర్వహించడం విడ్డూరంగా ఉందని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం వేంపల్లెలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాడు వాగ్దానాలు - నేడు వాయింపులు అనే పేరుతో గానీ ప్రజా చైతన్య కార్యక్రమం నిర్వహిస్తే సమంజసంగా ఉంటుందని ఎద్దేవా చేశారు. ఈ 17 నెలల పాలనలో ప్రభుత్వం మూడుసార్లు మద్యం ధరలు పెంచి మందుబాబుల కుటుంబీకుల రక్తం తాగుతోంద న్నారు. ఇసుక, సిమెంటు, పెట్రోల్‌, డీజలు ధరలతో ప్రజల నడ్డివిరిచిందన్నారు. సహజ వాయు వుపై వ్యాట్‌ను 14.5 శాతం నుంచి 24.5శాతానికి పెంచిందన్నారు. గ్రామ/వార్డు సచివాలయాల్లో పౌరసేవల రుసుం మూడురెట్లు పెంచిందన్నారు. త్వరలో అన్ని రోడ్లపై టోల్‌గేట్‌ వేయ బోతోందన్నారు. త్వరలో జట్టుపన్ను, బోడిగుండు పన్ను వేసినా ఆశ్చర్యం లేదని ఎద్దేవా చేశారు. 

Updated Date - 2020-11-07T05:06:50+05:30 IST