యువకుడి దారుణహత్య
ABN , First Publish Date - 2020-12-04T04:49:45+05:30 IST
పట్టణంలోని రాజులకాలనీలో గురువారం రాత్రి షేక్ యూసఫ్ (23) అనే యువకుడు దారుణహత్యకు గురయ్యాడు.

రాయచోటి, డిసెంబరు 3: పట్టణంలోని రాజులకాలనీలో గురువారం రాత్రి షేక్ యూసఫ్ (23) అనే యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. రాయచోటి అర్బన్ సీఐ రాజు కథనం మేరకు.. మృతుడిని మౌలాలి, షాహీనా అనే దంపతులు ఇద్దరూ కలిసి కత్తితో గొంతు కోశారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. షాహీనాతో గతంలో మృతుడికి వివాహేతర సంబంధం ఉండేదని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. సీఐ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.