హత్య కేసును ఛేదించిన పోలీసులు

ABN , First Publish Date - 2020-11-22T04:43:11+05:30 IST

నల్లగుట్టపల్లె వద్ద ఈనెల 18వ తేదీ దొరికిన ఓ వ్యక్తి మృతదేహం మిస్టరీని పోలీసులు ఛేదించా రు. హత్యకు గురైన వ్యక్తి వినోద్‌కుమార్‌ (27)గా గుర్తించినట్లు రామాపురం ఇంటెలిజెన్స్‌ పోలీసుల ద్వారా తెలిసింది.

హత్య కేసును ఛేదించిన పోలీసులు

రామాపురం, నవంబరు 21: రామాపురం మండలంలోని నల్లగుట్టపల్లె వద్ద ఈనెల 18వ తేదీ దొరికిన ఓ వ్యక్తి మృతదేహం మిస్టరీని పోలీసులు ఛేదించా రు. హత్యకు గురైన వ్యక్తి వినోద్‌కుమార్‌ (27)గా గుర్తించినట్లు రామాపురం ఇంటెలిజెన్స్‌ పోలీసుల ద్వారా తెలిసింది. హత్యకు గురైన వ్యక్తిని నిల్లికమ్మ మెయిన్‌ రోడ్‌శం మండలం కడలూరు జిల్లా తమిళనాడుకు చెందిన వాసిగా గుర్తించారు. వినాయగం, నారాయణ్‌, నాగేష్‌, ఢిల్లీ బాబు అనే నలుగురు వినాయగం అనే పేరుతో స్థాపించిన ఫైనాన్స్‌ కంపెనీలో వినోద్‌కుమార్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. వినాయగం మరదలు అయిన సుధా (22)తో వినోద్‌కుమార్‌కు వివాహేతర సంబంధం ఉండేది. దీనిని జీర్ణియించుకోలేని సుధా బావ అయిన వినాయగం, ఆమె తండ్రి నారాయణ్‌, నాగేష్‌, ఢిల్లీ బాబులు నలుగురు కలిసి 16వ తేదీ టీఎన్‌03 0927 నెంబరు గల ఎర్ర స్విఫ్ట్‌ కారులో కిడ్నాప్‌ చేసి వినోద్‌కుమార్‌ను హత్య చేసి రామాపురం మండలం నల్లగుట్టపల్లె సమీపంలోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న కాలిబాటలో మృతదేహాన్ని 18వ తేదీ పడేసి వెళ్లారు. వినోద్‌కుమార్‌ మిస్సింగ్‌ కేసు తమిళనాడులోని న్యూటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌లో క్రైమ్‌ నెంబర్‌ 1239/2020యూ/ ఎ్‌సఈసీ 363 కిడ్నాపింగ్‌ కేసు నమోదు చేసినట్లు రామాపురం ఇంటెలిజెన్స్‌ పోలీసుల ద్వారా సమాచారం తెలిసింది. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న లక్కిరెడ్డిపల్లె సర్కిల్‌ ఇనస్పెక్టర్‌ యుగంధర్‌, రామాపురం ఎస్‌ఐ మైనుద్దీన్‌, రాయచోటి డీఎస్పీ వాసుదేవన్‌లు దర్యాప్తు ముమ్మరం చేయడంతో కారు రంగు ఆధారంగా నిందితులు నలుగురిని చిత్తూరు కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలియవచ్చింది. 

Updated Date - 2020-11-22T04:43:11+05:30 IST