అనుమానం పెనుభూతమై భార్యను కడతేర్చిన భర్త

ABN , First Publish Date - 2020-11-06T06:05:48+05:30 IST

వివాహ మైన 20 ఏళ్లకు భా ర్యపై అనుమానం పెంచుకున్నారు. చి వరకు కిరాతకంగా భార్య నారాయణమ్మ(50)ను గొంతు కోసి చంపిన దారు ణ సంఘటన కాశినాయన మండలం చిన్నాయపల్లెలో చోటుచేసుకుంది.

అనుమానం పెనుభూతమై భార్యను కడతేర్చిన భర్త
పరిశీలిస్తున్న సీఐ మోహన్‌రెడ్డి, పోలీసు బృందం

పోరుమామిళ్ల, నవంబరు 5: పెళ్లినాటి బాసలు మరిచారు. వివాహ మైన 20 ఏళ్లకు భా ర్యపై అనుమానం పెంచుకున్నారు. చి వరకు కిరాతకంగా భార్య నారాయణమ్మ(50)ను గొంతు కోసి చంపిన దారు ణ సంఘటన కాశినాయన మండలం చిన్నాయపల్లెలో చోటుచేసుకుంది.  పోరుమామిళ్ల సీఐ మోహన్‌ రెడ్డి చెప్పిన వివరాల్లోకెళితే... కాశినాయన మండలం చిన్నాయపల్లె వాసి పుల్లారెడ్డికి బి.మఠం మండల వాసి బయపురెడ్డి కుమార్తె నారాయణమ్మతో 1985లో వివాహం జరిగింది. వీరికి పద్మావతి, వీరలక్ష్మి, వీరమోహన్‌రెడ్డి సంతానం. అయితే పదేళ్లగా భార్య నారాయణమ్మపై అనుమానం పెంచుకున్న పుల్లారెడ్డి తరచూ గొడవ పడేవాడు. ఐదు రోజుల కిందట ఆమె గొంతు కోసి గోనె సంచిలో దాచి సమీప పొలాల్లో పారవేశాడన్నారు. తల్లి కనిపించకపోవ డంతో కుమారుడు వీరమోహన్‌రెడ్డి  తండ్రిపై అనుమానంతో బి.కోడూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సీఐ మోహన్‌రెడ్డి, బి.కోడూరు ఎస్‌ఐ వెంకటరమణ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ నారాయణమ్మ మృతదేహం కనబడడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Updated Date - 2020-11-06T06:05:48+05:30 IST