వైభవంగా మురాదియా దర్గా ఉరుసు ఉత్సవాలు

ABN , First Publish Date - 2020-12-28T05:26:48+05:30 IST

కడప రవీంద్రనగర్‌లోని మురాదియా దర్గా 132వ హజరత్‌ అలీ మురాషా మరుదియా ఉరుసులో భాగంగా ఆదివారం రాత్రి ఆ దర్గా పీఠాధిపతి ముతవలి తహిరుల్‌ ఖదిరి చేతుల మీదుగా చాందినీ నిర్వహించారు.

వైభవంగా మురాదియా దర్గా ఉరుసు ఉత్సవాలు
చాందినీ ఊరేగింపులో పీఠాధిపతి

కడప (మారుతీనగర్‌), డిసెంబరు 27 : కడప రవీంద్రనగర్‌లోని మురాదియా దర్గా 132వ హజరత్‌ అలీ మురాషా మరుదియా ఉరుసులో భాగంగా ఆదివారం రాత్రి ఆ దర్గా పీఠాధిపతి ముతవలి తహిరుల్‌ ఖదిరి చేతుల మీదుగా చాందినీ నిర్వహించారు.  భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దర్గాపీఠాధిపతి ముతవలి తహిరుల్‌ ఖదిరి ఇంటి నుంచి ఫకీర్ల విన్యాసాలతో చాందినీని ఊరేగించారు. కార్యక్రమంలో ఆ దర్గాకు చెందిన అలీం మురాది, అజైజుల్లా బుకారి, మస్సొడ్‌, అబ్దుల్‌ హదితో పాటు జనవికాస్‌ సేవాసమితి అద్యక్షుడు తాహిర్‌,  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T05:26:48+05:30 IST