పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలి : ఆర్‌డీ

ABN , First Publish Date - 2020-12-31T05:13:55+05:30 IST

మున్సిపాలిటీలో పన్ను బకాయిల వసూళ్లు మరింత వేగవంతం చేసి మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడాలని రీజినల్‌ డైరెక్టర్‌ నాగరాజు అన్నారు.

పన్నుల వసూళ్లు వేగవంతం చేయాలి : ఆర్‌డీ
అధికారులతో మాట్లాడుతున్న రీజినల్‌ డైరెక్టర్‌ నాగరాజు

కమలాపురం, డిసెంబరు 30: మున్సిపాలిటీలో పన్ను బకాయిల వసూళ్లు మరింత వేగవంతం చేసి మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడాలని రీజినల్‌ డైరెక్టర్‌ నాగరాజు అన్నారు. బుధవారం నగర పంచాయతీల్లోని పలు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఆర్‌బీకేలతో పాటు నగర పంచాయతీలో జరుగుతున్న డ్రైనేజీ పనులను పరిశీలించారు. కొత్త మున్సిపల్‌ కార్యాలయాన్ని ప్రస్తుతం ఉన్న నగర పంచాయతీ కార్యాలయ ఆవరణలోనే నిర్మించుకోవచ్చని, అయితే పాత భవనాలను తొలగించి వెనుకవైపున భవనం నిర్మించి ముందువైపున ఖాళీ ప్రదేశం ఉంచుకోవాలన్నారు. తక్కువ సిబ్బందితోనే శానిటేషన్‌ పనులు బాగానే చేస్తున్నారన్నారు. మున్సిపల్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ రమణ, కమిషనర్‌ మునికుమార్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రాముడు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-31T05:13:55+05:30 IST