అభివృద్ధి ముసుగులో మున్సిపల్‌ అవినీతి

ABN , First Publish Date - 2020-12-07T04:57:25+05:30 IST

అభివృద్ది ముసుగుతో మున్సిపాలిటిలో కోట్ల రూపాయల అవినీతి పనులు సాగు తున్నాయిని పట్టణ అభివృద్ది సంఘం అధ్యక్షుడు, బీజేపీ సీనియర్‌ నేత కొవ్వూరు బాలచంద్రారెడ్డి విమర్శించారు.

అభివృద్ధి ముసుగులో మున్సిపల్‌ అవినీతి
డివైడర్లు కూల్చడాన్ని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన కొవ్వూరు బాలచంద్రారెడ్డి

నిరసనలో బీజేపీ నేత బాలచంద్రారెడ్డి

ప్రొద్దుటూరు అర్బన్‌, డిసెంబర్‌ 6 : అభివృద్ది ముసుగుతో మున్సిపాలిటిలో కోట్ల రూపాయల అవినీతి పనులు సాగు తున్నాయిని పట్టణ అభివృద్ది సంఘం అధ్యక్షుడు, బీజేపీ సీనియర్‌ నేత కొవ్వూరు బాలచంద్రారెడ్డి విమర్శించారు. ఆదివారం స్థానిక మైదుకూరు రోడ్డులో బాగున్న డివైడర్స్‌ను మున్సిపల్‌ అధికారులు కూల్చి వాటి మధ్య పెరిగిన వందలాది చెట్లను కూకటి వేళ్ళతో పెకలించడాన్ని నిరసిస్తూ కొవ్వూరు బాలచంద్రారెడ్డి రోడ్డుపై గంట పాటు బైఠాయించారు. ఈ సం దర్బంగా ఆయన మాట్లాడుతూ మైదుకూరు రోడ్డు, శివాలయం రోడ్డు, గాంధీ రోడ్లలో బాగున్న డివైడర్లను కూల్చి ఆధునీకణ పేరుతో వందలాది పచ్చని చెట్లను కూల్చివేశారన్నారు. చత్తీస్‌గడ్‌ రాష్ట్రంలో చెట్లను కూల్చితే ఎంతటివారినైనా జైలుకు పంపిస్తారని ఇక్కడ వాల్టా చట్టం వున్న అమలు పరిచే అధికారి లేడన్నారు.  పట్టణ కూడలల్లో పచ్చదనాన్ని .అందిస్తున్న వంద లాది చెట్లను ఎవరి అనుమతి తీసుకొని తొలగించారో చెప్ప మంటే ఒక్కఅధికారి ధైర్యంగా సమాధానం చెప్పలేక పోతున్నా రన్నారు. ఈదారుణంపై పట్టణ పర్యావణ ప్రేమికులు ముం దుకు రావాలని ఆయన కోరారు.  కోర్టులో ఈ దుర్మార్గులపై కేసు వేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ మాజీ అధ్యక్షుడు గురుప్రసాద్‌, మైనార్టీ అధ్యక్షుడు గౌస్‌, నరేంద్ర, జబివుల్లాలు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-07T04:57:25+05:30 IST