ఎంపీ సీఎం రమేష్ రూ.60 లక్షల విరాళం
ABN , First Publish Date - 2020-04-07T09:12:02+05:30 IST
కరోనా వైరస్ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్
కడప (కలెక్టరేట్), ఏప్రిల్ 6 : కరోనా వైరస్ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఎంపీ నిధుల నుంచి రూ.50 లక్షలను జిల్లా కరోనా సహాయనిధికి విరాళమిచ్చారు. విరాళం చెక్కును సోమవారం కలెక్టర్ హరికిరణ్‌ను కలసి అందజేశారు. అలాగే మరో రూ.10 లక్షల చెక్‌ను ప్రొద్దుటూరు మున్సిపాలిటిలో కరోనా నియంత్రణకు ప్రత్యేక విరాళాన్ని కలెక్టర్‌కు అందజేశాడు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్-19 కట్టడిలో భాగంగా తమ వంతు సహాయాన్ని అందిస్తున్న దాతలకు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. జిల్లా సహాయ నిధికి సాయం అందించాలనే దాతలు ముందుకు రావాలన్నారు. కోవిడ్-19 కు విరాళాలు ఇవ్వ దలిచిన వారు కలెక్టర్, కడప, బ్యాంకు ఖాతా నెంబరు 31902010061873, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ నెంబరు ఎస్‌వైఎన్‌బి0003190 సిండి కేట్ బ్యాంకు మెయిన్ బ్రాంచ్ కడప వారి పేరు మీద ఆర్టీజీఎస్ ద్వారా, లేదా అన్‌లైన్ ద్వారా చెక్ లేదా డీడీ రూపంలో విరాళాలను అందించాలని కలెక్టర్ తెలిపారు.