నష్టపోయిన రైతులను ఆదుకుంటాం : ఎంపీ

ABN , First Publish Date - 2020-12-01T05:56:04+05:30 IST

తుఫాన్‌ వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటామని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు.

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం : ఎంపీ
మండలంలోని సమస్యలను ఎంపీకి వివరిస్తున్న నాయకులు

చక్రాయపేట, నవంబరు 30: తుఫాన్‌ వల్ల నష్టపోయిన రైతులను  ఆదుకుంటామని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన చక్రాయపేట మండలంలోని అద్దాలమర్రి, కుమార్లకాల్వ, సిద్దారెడ్డిగారిపల్లె గ్రామాలలో పంటలను పరిశీలిం చారు. స్థానికులు ఎంపీకి సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసు కెళ్లి  నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నష్టపరిహారం డిసెం బరు 31కల్లా అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఓఎస్డీ అనిల్‌ కుమార్‌రెడ్డి, ఏఓ నవంత్‌బాబు, శ్రీధర్‌రెడ్డి, శేషారెడ్డి, అద్దాలమర్రి మల్లికార్జునరెడ్డి, రామాంజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-01T05:56:04+05:30 IST