ఉద్యమనిధి సేకరణ

ABN , First Publish Date - 2020-12-27T04:59:15+05:30 IST

ఢిల్లీలో రైతులు చేపడుతున్న పోరాటానికి మద్ధతుగా ఉద్యమనిధి సేకరిస్తున్నట్లు అఖిల భారత కిసాన కో ఆర్డినేషన కమిటీ పట్టణ కన్వీనర్‌ కె.శ్రీనివాసులు ప్రకటించారు.

ఉద్యమనిధి సేకరణ
ఉద్యమనిధి సేకరిస్తున్న అఖిలభారత కిసాన నేతలు

బద్వేలు, డిసెంబరు 26: ఢిల్లీలో రైతులు చేపడుతున్న పోరాటానికి మద్ధతుగా ఉద్యమనిధి సేకరిస్తున్నట్లు  అఖిల భారత కిసాన కో ఆర్డినేషన కమిటీ పట్టణ కన్వీనర్‌ కె.శ్రీనివాసులు ప్రకటించారు. శనివారం ప్రారంభించిన ఉద్యమ నిధి సేకరణలో ఆయన మాట్లాడుతూ నెల రోజులుగా ఢిల్లీ వేదికగా రైతులు చేస్తున్న పోరాటం పట్ల ప్రధాని స్పందించకపోవడం దారుణమన్నారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, కాంట్రాక్ట్‌ కార్పొరేట్‌ వ్యవసాయాన్ని మానుకోవాలని డిమాండ్‌ చేశారు.

రైతు పోరాటానికు ప్రతి ఒక్కరూ మద్ధతు పలికి భవిష్యత పోరాటానికి నాంది పలకాలన్నారు. కార్యక్రమంలో  సీఐటీయూ సీనియర్‌ నేత  షేక్‌ ఖాదర్‌ హుసేన, జిల్లా కార్యద ర్శి  కె.నాగేంద్రబాబు, డీవైవైఎఫ్‌ నేతలు ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, ఆవాజ్‌ జిల్లా అధ్యక్షుడు చాంద్‌బాష, పట్టణ నేతలు షేక్‌ అన్వర్‌బాష, షేక్‌ మస్తాన బల్డింగ్‌ యూనియన నేత లు షేక్‌ నాయబ్‌రసూల్‌, షేక్‌ ఇబ్రహీం, ర వి, ఓబయ్య, పెద్ద ఓబులేసు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-27T04:59:15+05:30 IST