సీఎంను కలిసిన ఎమ్మెల్సీ జకియాఖానం

ABN , First Publish Date - 2020-08-11T11:16:34+05:30 IST

ఎమ్మెల్సీ జకియాఖానం సోమవారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

సీఎంను కలిసిన ఎమ్మెల్సీ జకియాఖానం

రాయచోటిటౌన్‌, ఆగస్టు10: ఎమ్మెల్సీ జకియాఖానం సోమవారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డితో కలిసి రాజధానిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో  సీఎంను కలిశారు. జకియాఖానం మాట్లాడుతూ  ఎంపీ మిథున్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి సహకారం, సూచనలతో పార్టీ అభివృద్ధితో పాటు మహిళా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

Updated Date - 2020-08-11T11:16:34+05:30 IST