-
-
Home » Andhra Pradesh » Kadapa » MLA Press Meet
-
మార్చి 15 వరకు కేసీకి నీరిస్తాం : ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2020-12-11T04:58:13+05:30 IST
ఖరీఫ్‌లో వచ్చిన తుపాన్‌తో రైతులు తీ వ్రంగా నష్టపోవడంతో మార్చి 15 వరకు కేసీ కాల్వకు నీళ్లు ఇస్తామని ఎమ్మెల్యే రఘురామి రెడ్డి ప్రకటించారు.

మైదుకూరు, డిసెంబరు 10: ఖరీఫ్‌లో వచ్చిన తుపాన్‌తో రైతులు తీ వ్రంగా నష్టపోవడంతో మార్చి 15 వరకు కేసీ కాల్వకు నీళ్లు ఇస్తామని ఎమ్మెల్యే రఘురామి రెడ్డి ప్రకటించారు. ఎంపీపీ కార్యాలయంలో గురు వారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే పరిహారం సహా మరి కొంత వెసులుబాటు కల్పిస్తూ రబీలో పంటలు సాగు చేసు కునేందుకు మార్చి 15 వరకు కేసీ కాల్వకు నీళ్లు ఇస్తామన్నారు. వరద లతో నష్టపోయిన రైతులకు మరుసటి నెలలోనే ప్రభుత్వం పరిహారం అందిస్తోందన్నారు. గతంలో ఎవరూ అమలు చేయని విధంగా ముఖ్య మంత్రి జగన్ రైతులకు ఊరట కల్పిస్తున్నారన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో 10వేల హెక్టార్లల్లో వరిపంట దెబ్బతినిందన్నారు. ఎకరాకు రూ. 30 వేల వరకు రైతులు పెట్టుబడి పెట్టారన్నారు. శ్రీశైలంలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయని దీంతో రైతు కోలుకు నేందుకు రబీ పంటల కోసం మార్చి 15 వరకు కేసీలో నీళ్లు ఇస్తామన్నారు. రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడకుండా జనవరి 1 నుంచి వలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే వచ్చి రేషన్ సరుకులు అందిస్తామని తెలిపారు. 25న 2598 మందికి ఇంటి పట్టాలు ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు శ్రీమన్నారాయణరెడ్డి, కేసీ లింగన్న, బీఎన్ శ్రీనివాసులు, నరసింహారెడ్డి, బోకుల కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.