ప్రభుత్వ ఆసుపత్రి ఎమ్మెల్యే తనిఖీ

ABN , First Publish Date - 2020-12-20T05:11:45+05:30 IST

రాజంపేట ఏరియా ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా చేస్తున్న సందర్భంగా అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తనిఖీ చేసి తగు సూచనలు చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రి ఎమ్మెల్యే తనిఖీ

రాజంపేట, డిసెంబరు19 : రాజంపేట ఏరియా ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా చేస్తున్న సందర్భంగా అక్కడ చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తనిఖీ చేసి తగు సూచనలు చేశారు. శనివారం ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ మాధవరెడ్డి, ఇతర డాక్టర్లతో వంద పడకల ఆసుపత్రికి కావాల్సిన చర్యలపై అక్కడ ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలపై చర్చించారు. డీఈ శివరామిరెడ్డి, కాంట్రాక్టర్‌ కొండారెడ్డితో అభివృద్ధి పనులపై మ్యాప్‌ ద్వారా అడిగి తెలుసుకున్నారు.  విద్యుత్‌ అభివృద్ధి పనులపై ఈఈ చంద్రశేఖర్‌రావుతో మాట్లాడారు. ఆసుపత్రిలో పనిచేసే కాంట్రాక్ట్‌ సిబ్బందికి వేతనాలు రావడం లేదని  ఎమ్మెల్యేకి తెలిపారు. పోలా శ్రీనివాసులరెడ్డి, గీతాంజలి విద్యాసంస్థల అధినేత ఎస్‌.వి.రమణ, విశ్వనాధరెడ్డి, ఆసుపత్రి అభివృద్ధిమాజీ చైర్మన్‌ వడ్డె రమణ, మర్రి రవి, పసుపులేటి సుధాకర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-20T05:11:45+05:30 IST