భార్య, పిల్లలు కనిపించలేదని ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-03-16T10:37:24+05:30 IST

భార్య, పిల్లలు కనిపించలేదని రైల్వేకోడూరు మండలంలోని మైసూరివారిపల్లె పంచాయతీ పరిధిలోని శాంతినగర్‌ కు చెందిన గన్నే శ్రీనివాసులు ఆదివారం స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు

భార్య, పిల్లలు కనిపించలేదని ఫిర్యాదు

రైల్వేకోడూరురూరల్‌, మార్చి, 15: భార్య, పిల్లలు కనిపించలేదని రైల్వేకోడూరు మండలంలోని మైసూరివారిపల్లె పంచాయతీ పరిధిలోని శాంతినగర్‌ కు చెందిన గన్నే శ్రీనివాసులు ఆదివారం స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బాధితుడు కథనం మేరకు...ఈనెల 13వ తేదీ నుంచి తన భార్య పద్మ, పిల్లలు హరీష్‌, కుమార్తె పల్లవిలు కనిపించలేదన్నారు. తన భార్య స్వగ్రామం చిట్వేలి మండలంలోని చెర్లోపల్లె అని..  అక్కడకు వెళ్లి వెతికినా కనిపించలేదన్నారు. తాను బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని... కుటుంబంలో ఎలాంటి తగువులు లేవన్నారు. తన భార్య పిల్లలు ఎందుకు కనిపంచకుండాపోయారనేది అంతుపటడం లేదని తెలి పాడు. వెంటనే తన భార్య పిల్లల ఆచూకీ తెల పాలని వేడుకుంటున్నాడు.

Updated Date - 2020-03-16T10:37:24+05:30 IST