కంటైనర్‌లో వలస కూలీలు

ABN , First Publish Date - 2020-05-13T07:57:25+05:30 IST

ప్రొద్దుటూరులో ఉంటున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన 60 మంది కూలీలు కంటైనర్‌ ద్వారా తమ స్వస్థలాలకు వెళ్లే ప్రయత్నం చేయగా,

కంటైనర్‌లో వలస కూలీలు

అడ్డుకుని క్వారంటైన్‌కు తరలించిన పోలీసులు


ప్రొద్దుటూరు క్రైం, మే 12 : ప్రొద్దుటూరులో ఉంటున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన 60 మంది కూలీలు కంటైనర్‌ ద్వారా తమ స్వస్థలాలకు వెళ్లే ప్రయత్నం చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. రూరల్‌ సీఐ విశ్వనాధరెడ్డి వివరాల మేరకు... ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు కొన్ని నెలలుగా ప్రొద్దుటూరులో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.


లాక్‌డౌన్‌ కారణంగా పనులకు వెళ్లలేక, చేతిలో డబ్బు లేక అవస్థలు పడుతున్నారు. ఎలాగైనా తమ స్వస్థలాలకు వెళ్లాలనే ఉద్దేశంతో కంటైనర్‌లో వెళ్లేందుకు యత్నించారు. అయితే కొత్తపల్లె చెక్‌పోస్టు వద్ద పోలీసుల తనిఖీలో ఈ వ్యవహారం బయటపడింది. దీంతో వారిని అక్కడే దింపేసి తహసీల్దార్‌ ఎదుట హజరుపరచగా క్వారంటైన్‌కు తరలించినట్లు సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. 

Read more