మధ్యాహ్న భోజన పథకం తనిఖీ
ABN , First Publish Date - 2020-12-02T04:52:29+05:30 IST
జగనన్న గోరుముద్ద కార్యక్రమం అమలు, పనితీరు తనిఖీల్లో భాగంగా మంగళవారం స్థానిక నందలూరు హైస్కూలును మధ్యాహ్న భోజన పథకం జిల్లా తనిఖీ అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్ షేక్ ఎజాజ్‌బాషా ఆకస్మికంగా తనిఖీ చేశారు.

నందలూరు, డిసెంబరు 1 : జగనన్న గోరుముద్ద కార్యక్రమం అమలు, పనితీరు తనిఖీల్లో భాగంగా మంగళవారం స్థానిక నందలూరు హైస్కూలును మధ్యాహ్న భోజన పథకం జిల్లా తనిఖీ అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్ షేక్ ఎజాజ్‌బాషా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులు, రిజిస్టర్‌లు పరిశీలించారు. కోవిడ్ సెలవుల్లో విద్యార్థులకు పంపిణీ చేసిన డ్రై రేషన్ వివరాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో డీఈవో కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ మహమ్మద్‌రఫీ, హెచ్‌ఎం బి.రమాదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.