మధ్యాహ్న భోజన నాణ్యతలో రాజీ వద్దు

ABN , First Publish Date - 2020-11-06T05:30:00+05:30 IST

మధ్యాహ్న భోజన పథకం నాణ్యతలో రాజీ వద్దని రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స (డీజీఈ) సుబ్బారెడ్డి అన్నారు.

మధ్యాహ్న భోజన నాణ్యతలో రాజీ వద్దు
విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకుంటున్న సుబ్బారెడ్డి

డీజీఈ సుబ్బారెడ్డి

కడప (ఎడ్యుకేషన), నవంబరు 6 : మధ్యాహ్న భోజన పథకం నాణ్యతలో రాజీ వద్దని రాష్ట్ర డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స (డీజీఈ) సుబ్బారెడ్డి అన్నారు. కడప జయనగర్‌ కాలనీ జడ్పీ బాలికోన్నత పాఠశాలను శుక్రవారం ఆయన తని ఖీ చేశారు. ముందుగా ‘నాడు-నేడు’ పనులను పరిశీలించారు. అనంతరం విద్యా ర్థులను కలిసి మధ్యాహ్న భోజన పథకంపై ఆరా తీశారు. మెనూ ప్రకారం ఎం డీఎం ఇస్తున్నారా, లేదా అని ప్రశ్నించారు. రుచి, శుచి గురించి అడిగి తెలుసు కున్నారు. అలాగే జగనన్న విద్యాకానుకలో అన్నీ సరిగా అందినదీ, లేనిదీ అడిగి తెలుసుకున్నారు. అలాగే కొవిడ్‌ నిబంధనలు అమలు కూడా పరిశీలించారు. అనంతరం ఇస్కాన సంస్థ ప్రతినిధులను పిలిపించి పలు సూచనలు చేశారు. మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీ వద్దని సూచించారు. ముఖ్యమంతిర వైఎస్‌ జగనమోహనరెడ్డి మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసు కున్నట్లు తెలిపారు. ఎటువంటి పొరపాట్లు జరిగినా చర్యలు తప్పవని హెచ్చ రించారు. డీఈఓ పి.శైలజ, పాఠశాల హెచఎం పాల్గొన్నారు.


Updated Date - 2020-11-06T05:30:00+05:30 IST