-
-
Home » Andhra Pradesh » Kadapa » Meter Reading Labours
-
మీటర్‌రీడింగ్ కార్మికులకు వేతనాలు ఇవ్వాలి
ABN , First Publish Date - 2020-12-16T05:15:34+05:30 IST
విద్యుత్ శాఖలో మీటర్ రీడింగ్ తీసే కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని సీపీ ఎం పట్టణ కార్యదర్శి సత్యనారాయణ డిమాండ్ చేశారు.

ప్రొద్దుటూరు టౌన్, డిసెంబరు 15: విద్యుత్ శాఖలో మీటర్ రీడింగ్ తీసే కార్మికులకు వెంటనే వేతనాలు చెల్లించాలని సీపీ ఎం పట్టణ కార్యదర్శి సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆ మేరకు మంగళవారం ట్రాన్స్‌కో సీఎండి హరినాథరావుకు సీపీ ఎం ఆధ్వర్యంలో కార్మికులు వినతిపత్రం అందజేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ 20 సంవత్సరాల నుంచి కార్మికులు మీటర్ రీడింగ్ విధులు నిర్వహిస్తున్నా ప్రభుత్వం వేతనాలు ఇవ్వకుండా మీటరుకు కొంతమొత్తాన్ని ఇస్తూ వారి శ్రమ ను దోచుకుంటోందని విమర్శించారు. ఈపీడీసీఎల్ పద్ధతిలో బిల్లింగ్ పనిదినాలను 22 రోజులకు పెంచాలని, ఏఈ లాగిన్‌లో డోర్‌లాక్ సర్వీసు డబ్బులను కార్మికులకే చెల్లించాలని కోరారు. కార్మికులకు సంవత్సరం నుంచి పెండింగ్‌లో ఉన్న ఈపీఎఫ్, ఈఎ్‌సఐలను త్వరగా చెల్లించడానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ కార్యదర్శి విజయకుమార్, మీటర్ రీడింగ్ యూనియన్ కార్యదర్శి ఓబులేసు, లక్ష్మినారాయణ, గఫార్ బాష, రమణ, బాబా, షబ్బీర్, నరేంద్ర, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలని వినతి
ఎర్రగుంట్ల, డిసెంబరు 15: మీటర్ రీడింగ్ తీసే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఎండీకి మంగళవారం వినతి పత్రాన్ని ఇచ్చినట్లు యూనియన్ నాయకుడు ఓబులేసు తెలిపారు. పీసురేటు విధానం రద్దుచేసి పిక్స్‌డ్ వేతనం ఇవ్వాలని, ప్రొద్దుటూరు డివిజన్‌లో ఎర్రగుంట్ల, జమ్మలమడుగు సబ్ డివిజన్స్‌లోని మీటర్ రీడర్స్‌కు ఈపీఎఫ్, ఈఎ్‌సఐ వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సీఎండీకి వినతిపత్రం ఇచ్చిన వారిలో నరేంద్ర, రాంప్రసాద్, పవన్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.