ఉపకరణాలను సద్వినియోగం చేసుకోండి

ABN , First Publish Date - 2020-12-30T05:09:33+05:30 IST

ప్రత్యేక అవసరాలున్న పిల్లలు ఉపకరణాలను సద్వి నియోగం చేసుకోవాల ని మండల విద్యాశాఖాధికారి రామచంద్ర య్య పేర్కొన్నారు.

ఉపకరణాలను సద్వినియోగం చేసుకోండి
వినికిడి యంత్రంతో పరీక్షిస్తున్న డాక్టర్లు

భవిత కేంద్రంలో వైద్య పరీక్షలు

బద్వేలు రూరల్‌, డిసెంబరు 29: ప్రత్యేక అవసరాలున్న పిల్లలు ఉపకరణాలను సద్వి నియోగం చేసుకోవాల ని మండల విద్యాశాఖాధికారి రామచంద్ర య్య పేర్కొన్నారు. మంగళవారం స్థానిక భవిత కేంద్రంలో కడ ప రిమ్స్‌ వైద్యులు ఈ ఎనటీ స్పెషలిస్ట్‌ డాక్ట ర్‌ కిరీటి, ఆర్దోపెడిక్‌ స్పెషలిస్టు డాక్టర్‌ శ్యామ్యుల్‌, డాక్టర్‌ ఆయేష ఆధ్వర్యంలో ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించి వారికి అవసరమ య్యే ఉపకరణాలందించారు.

ఈ సందర్భంగా జిల్లాపరిషత ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయకుమార రెడ్డి, సహిత విద్య సమన్వయ కర్త కేశవరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు భవిత కేంద్రం అన్నివిధాలా ఉపయోగంగా ఉంటుందని, ఉచిత ఉపకరణాలు వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధి మండలాలకు సంబంధించిన దివ్యాంగులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో సహిత ఉపాధ్యాయులు ఫిజియోథెరపి్‌స్ట తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T05:09:33+05:30 IST