జనవరి 1 నుంచి ఫిమ్స్‌లో వైద్యసేవలు

ABN , First Publish Date - 2020-12-28T05:28:23+05:30 IST

జనవరి 1 నుంచి గతంలో మాదిరిగా ప్రజలకు వైద్య సేవలు, శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని ఫాతిమా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అధినేత జావాద్‌ పేర్కొన్నారు.

జనవరి 1 నుంచి ఫిమ్స్‌లో వైద్యసేవలు

కడప (ఎడ్యుకేషన్‌), డిసెంబరు 27 : జనవరి 1 నుంచి గతంలో మాదిరిగా ప్రజలకు వైద్య సేవలు, శస్త్రచికిత్సలు నిర్వహిస్తామని ఫాతిమా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అధినేత జావాద్‌ పేర్కొన్నారు. కడప ఫిమ్స్‌లో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020 ఏప్రిల్‌ నుంచి కలెక్టరు ఆదేశాల మేరకు ఫాతిమా మెడికల్‌ కాలేజీని కొవిడ్‌ ఐసోలేషన్‌ సెంటరుగా మార్చడం జరిగిందన్నారు. నవంబరు 30 నుంచి కళాశాల తిరిగి ప్రారంభమైందన్నారు. అన్ని విధాలా పరిశుభ్రత పాటించి, జనవరి 1 నుంచి యదావిధిగా వైద్యసేవలు అందిస్తామన్నారు. ఫాతిమా కోవిడ్‌ ఆసుపత్రి కాదని, ప్రజలు గుర్తించాలన్నారు. కార్యక్రమంలో ఫిమ్స్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ గిరిధర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T05:28:23+05:30 IST