మట్టి నమూనా సేకరణ పై రైతులకు అవగాహన

ABN , First Publish Date - 2020-12-06T04:58:58+05:30 IST

ప్రపంచ నేలల ది ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా మట్టి నమూనా సేకరణ పై రైతులకు శనివారం మండలంలోని వీపీఆర్‌ కండ్రిక గ్రామంలో అనంతరాజుపేట ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్‌ శాస్త్రవేత్త ఆర్‌. నాగరాజు, శాస్త్రవేత్తలు టి. నాగలక్ష్మీ, డి. శ్రీధర్‌ లు అవగాహన కల్పించారు.

మట్టి నమూనా సేకరణ పై రైతులకు అవగాహన

రైల్వేకోడూరు, డిసెంబరు, 5: ప్రపంచ నేలల ది ప్రపంచ నేలల దినోత్సవం సందర్భంగా మట్టి నమూనా సేకరణ పై రైతులకు శనివారం మండలంలోని వీపీఆర్‌ కండ్రిక గ్రామంలో అనంతరాజుపేట ఉద్యాన పరిశోధనా స్థానం సీనియర్‌ శాస్త్రవేత్త ఆర్‌. నాగరాజు, శాస్త్రవేత్తలు టి. నాగలక్ష్మీ, డి. శ్రీధర్‌ లు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు నేలల ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం వీపీఆర్‌కండ్రిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు, రైతులు కలిసి మానవహారం చేశారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. మొక్కలు నాటారు. వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు గుంటిమడుగు సుధాకర్‌రాజు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-06T04:58:58+05:30 IST