వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-20T05:05:55+05:30 IST

చింతకొమ్మదిన్నె మండలంలోని అంగడివీధి బాబానగర్‌కు చెందిన అన్నామలై మణికంఠ (33) వ్యసనాలకు బానిసై ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ రాజరాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.

వ్యక్తి ఆత్మహత్య

సికెదిన్నె, డిసెంబరు 19: చింతకొమ్మదిన్నె మండలంలోని అంగడివీధి బాబానగర్‌కు చెందిన అన్నామలై మణికంఠ (33) వ్యసనాలకు బానిసై ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ రాజరాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. అతని భార్య ఫిర్యాదు మేరకు... మణికంఠ రైల్వే లగేజీ హోటల్‌లో ఉద్యోగం చేసేవాడు. విధులకు సరిగా వెళ్లకపోవడంతో డిపార్టు మెంట్‌ వారు అతన్ని తొలగించారు. అతని భార్య అభ్యర్థన మేరకు మళ్లీ అతనికి ఉద్యోగం ఇచ్చి కర్ణాటక రాష్ట్రం యాదగిరికి బదిలీ చేశారు. వ్యసనాలకు లోనై అక్కడ కూడా డ్యూటీ చేయకుండా అప్పులు చేశాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం అప్పులు తీర్చేందుకు రూ.30 వేలు ఇవ్వాలని భార్యను అడుగగా డబ్బు ఎక్కడ చెల్లించాలో చెబితే ఇస్తానని, నీ చేతికి ఇవ్వనని చెప్పి  పక్క వీధిలోనే ఉన్న అత్తగారింటికి వెళ్లింది.  తిరిగి రాత్రి 10 గంటల సమయంలో ఇంటికొచ్చి చూడగా ఇనుపపైపునకు చున్నీతో ఉరివేసుకున్నట్లు గుర్తించి ఫిర్యాదు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Read more