కొనసాగుతున్న గాలింపు

ABN , First Publish Date - 2020-11-22T04:31:19+05:30 IST

తెలుగుగంగ కాల్వలో గల్లంతైన ఓబులాపురం సురేష్‌ మృతదేహం కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్య లు చేపట్టారు.

కొనసాగుతున్న గాలింపు

కలసపాడు, నవంబరు 21: తెలుగుగంగ కాల్వలో గల్లంతైన ఓబులాపురం సురేష్‌ మృతదేహం కోసం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్య లు చేపట్టారు. అక్కిసిద్దుపల్లె వద్ద తెలుగుగంగ కాల్వలో చెన్నారెడ్డిపల్లె వాసి సురేష్‌ గల్లంతైన విషయం తెలిసిందే. దీంతో శనివారం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తెలుగుగంగ కాల్వలో, చింతలపల్లె చెరువులో గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. అయినా ఆచూకీ దొరకలేదు. గజ ఈతగాళ్లను పిలిపించి గాలింపు చర్యలు చేపట్టారు. వలలతో కాల్వ మొత్తం జల్లెడ పట్టారు. నీరు తూములకు ఎత్తి తెలుగుగంగ కాల్వలో నీరు తగ్గించినా కనబడలేదు. కనబడే వరకు గాలింపు చర్యలు చేపడతామని ఎస్‌ఐ గణమద్దిలేటి తెలిపారు.

Read more