ట్రాక్టర్‌ బోల్తా.. ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-03-04T10:19:42+05:30 IST

రాజంపేట మండలం బగ్గిడిపల్లె వద్ద మంగళవారం ట్రాక్టర్‌ బోల్తాపడి ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యా యి.

ట్రాక్టర్‌ బోల్తా.. ఒకరి మృతి

మరొకరికి తీవ్రగాయాలు 

రాజంపేట టౌన్‌, మార్చి3 : రాజంపేట మండలం బగ్గిడిపల్లె వద్ద మంగళవారం ట్రాక్టర్‌ బోల్తాపడి ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యా యి. వివరాల్లోకెళితే..  బగ్గిడిపల్లె వద్ద ఉన్న కొండరాయిక్వారీ వద్దకు ఏపీ26ఏఎం1522 నెంబరు గల ట్రాక్టర్‌లో వై.వెంకటయ్య, పవన్‌కుమార్‌ల వెలుతుండగా అదుపు తప్పి బోల్తా పడింది.


దీంతో ట్రాక్టర్‌ తోలుతున్న వై.వెంకటయ్య (22) అనే వ్యక్తి మృతి చెందాడు. ట్రాక్టర్‌లో వున్న పవన్‌కుమార్‌కు తీవ్రగాయాలు కావడంతో తిరుపతికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మన్నూరు ఎస్‌ఐ హనుమంతు తెలిపారు. 

Updated Date - 2020-03-04T10:19:42+05:30 IST