అనాలోచిత నిర్ణయాలతో విద్యావ్యవస్థ నాశనం

ABN , First Publish Date - 2020-12-28T05:00:53+05:30 IST

సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో విద్యావ్యవస్థ సర్వనాశనం అవుతోందని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి విమర్శించారు.

అనాలోచిత నిర్ణయాలతో విద్యావ్యవస్థ నాశనం
సమావేశంలో మాట్లాడుతున్న మల్లెల లింగారెడ్డి

 టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి

ప్రొద్దుటూరు క్రైం, డిసెంబరు 27 : సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో విద్యావ్యవస్థ సర్వనాశనం అవుతోందని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన తన కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పోలుదాసు కృష్ణమూర్తితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉన్నత విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తూ నిరుపేద విద్యార్థులకు ఫీజీ విద్యను దూరం చేస్తున్నారన్నారు. నిరుపేద విద్యార్థుల భవిష్యత్‌కు విఘాతం కలిగించేలా జగన్‌ సర్కార్‌ తీసుకొచ్చిన జీవో 115ను వ్యతిరేకిస్తున్నామని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  ఆ నాడు టీడీపీ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు, మహిళలు ఉన్నత చదువు చదువుకునేందుకు ఎంతో తోడ్పాటునందించిందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పక్కాగా అమలు చేసి, వారి విద్యాభివృద్దికి దోహదపడిందన్నారు. నేడు వైసీపీ ప్రభుత్వం రకరకాల పథకాలతో ప్రజలను మభ్యపెట్టి, ఇపుడు ప్రభుత్వ కళాశాలల్లో, యూనివర్శిటీల్లో చదివే పీజీ విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తామని, ప్రైవేట్‌, ఆన్‌ఎయిడెడ్‌, ఎయిడెడ్‌ పీజీ కళాశాలల్లో చదివే విద్యార్థులకు రద్దు చేయడం దుర్మార్గపు చర్య అన్నారు. ప్రైవేట్‌ కళాశాల్లో పీజీ విద్యను అభ్యసించే వారి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారవుతుందన్నారు. జీవో 115ను వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో విద్యార్థులతో కలిసి అందోళన చేస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర వికలాంగుల సంస్థ మాజీ డైరక్టర్‌ సిద్దయ్య, కడప నగర నాయకులు శివకొండారెడ్డి, పట్టణ నాయకులు సీతారామిరెడ్డి, సుబ్బరాజు, గురప్పయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-28T05:00:53+05:30 IST