-
-
Home » Andhra Pradesh » Kadapa » Loss Farmers
-
నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేస్తాం
ABN , First Publish Date - 2020-12-11T04:52:03+05:30 IST
వరుస తుఫాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు పంట నష్టపరిహా రం అం దుతుందని వ్యవసాయ శాఖ అదనపు సంచాలకురాలు సా యిలక్ష్మి పేర్కొన్నారు.

ప్రొద్దుటూరు రూరల్, డిసెంబరు 10: వరుస తుఫాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు పంట నష్టపరిహా రం అం దుతుందని వ్యవసాయ శాఖ అదనపు సంచాలకురాలు సా యిలక్ష్మి పేర్కొన్నారు. మండలంలోని బొల్లవరం గ్రామ పొలా ల్లో రైతులు సాగు చేసిన శనగ పంటను గురువారం ఆమె పరిశీలించి నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో శనగ విత్తనాలను శుక్రవారం నుంచే పంపిణీ చేసే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, ముద్దనూరు, పులివెందుల, మండలాల ఏడీఏలతో స్థానిక ఏడీఏ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి వేరుశనగ విత్తనకాయలు నాణ్యత, సేకరణపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో జేడీఏ మురళీకృష్ణ, ఏడీఏ ఇన్నయ్యరెడ్డి, ఏవో శివశంకర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎర్రగుంట్లలో: నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులకు రాష్ట్ర వ్యవసాయశాఖ అదనపు సంచాలకులు వై.సాయిలక్ష్మి ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆమె మండలంలోని తిప్పలూరు గ్రామంలో భారీ వర్షాలకు దెబ్బ తిన్న శనగపంటను ఏపీ ప్రభుత్వ వ్యవసాయ శాఖ ప్రధాన సలహాదారు అంబటి క్రిష్ణారెడ్డి, ఏడీఏ పద్మలత, ఏడీఏ మురళీక్రిష్ణ తదితరులతో కలిసి పరిశీలించారు. పంట దెబ్బతిన్న ప్రతిరైతుకు నష్టపరిహారం అందుతుందన్నారు. మళ్లీ విత్తనం వేసుకునేందుకు ప్రభుత్వం 80శాతం సబ్సిడితో అం దజేస్తుందన్నారు. ఏవో లక్ష్మణ్‌కుమార్, కేవీకే శాస్త్రవేత్త సునీల్ కుమార్, వీఏఏలు, రైతులు పాల్గొన్నారు.