కన్నుల పండువగా.. స్వామివారి కల్యాణం

ABN , First Publish Date - 2020-12-21T05:20:32+05:30 IST

సుబ్రమణ్యం షష్ఠి సందర్భాన్ని పురష్కరించుకొని నగర రిమ్స్‌రోడ్డు సమీపంలోని రామచంద్రయ్యకాలనీలో వెలసిన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రమణ్యంస్వామివారి దేవస్థానంలో స్వామివారి కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు.

కన్నుల పండువగా.. స్వామివారి కల్యాణం
సుబ్రమణ్యస్వామి

కడప(మారుతీనగర్‌), డిసెంబరు 20: సుబ్రమణ్యం షష్ఠి సందర్భాన్ని పురష్కరించుకొని నగర రిమ్స్‌రోడ్డు సమీపంలోని రామచంద్రయ్యకాలనీలో వెలసిన శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రమణ్యంస్వామివారి దేవస్థానంలో స్వామివారి కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. ఆ ఆలయ ధర్మకర్త రామచంద్రయ్య ఆధ్వర్యంలో జరిగిన కల్యాణ మహోత్సవానికి మహిళలు అధిక సంఖ్యలో హాజరై కన్నులారా వీక్షించి ఆనందపారవశ్యం పొందారు. తదనంతరం ఆలయంలో హోమం నిర్వహించడంతో పాటుగా విచ్చేసిన భక్తాదులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. Updated Date - 2020-12-21T05:20:32+05:30 IST