21 పోలింగ్‌ రోజున స్థానిక సెలవు

ABN , First Publish Date - 2020-03-15T10:49:42+05:30 IST

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌ నిర్వహించే కేంద్రాల పరిధిలో ఎన్నికల కమిషన్‌ నియమ,

21 పోలింగ్‌ రోజున స్థానిక సెలవు

కడప((కలెక్టరేట్‌) మార్చి 14 : స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పోలింగ్‌ నిర్వహించే కేంద్రాల పరిధిలో ఎన్నికల కమిషన్‌ నియమ, నిబంధనల మేరకు ఈ నెల 21వ తేదీ (పోలింగ్‌ రోజు) సెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు కలెక్టర్‌ సి.హరికిరణ్‌  శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు  ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా అదికారులు బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. పోలింగ్‌ నిర్వహించే కేంద్రాల్లో పక్కాగా ప్రభుత్వ ఉత్తర్వులు, చట్టాలను అమలు చేయాలన్నారు.


ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జిల్లాలో 21వ తేదీ జరుగుతాయన్నారు. పోలింగ్‌ పరిసరాల్లో షాపులు, వ్యాపార సంస్థలకు పెయిడ్‌ హాలిడేగా ప్రకటించడం జరిగిందన్నారు. లేబరు యాక్ట్‌ తప్పక అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని లేబర్‌ కమిషనర్‌ను ఆదేశించారు. పోలింగ్‌ రోజున ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలకు సెలవులు ప్రకటించామన్నారు. జడ్పీ, జిల్లా  పంచాయతీ అధికారులు తప్పక అమలు చేయాలన్నారు. పోలింగ్‌ ముందు రోజు నుంచి పరిసర ప్రాంతాల్లో  మద్యం వ్యాపారాలు 48 గంటల ముందే నిలిసివేయాలన్నారు.


20 నుంచి 21వ తేదీ వరకు రెండు రోజుల పాటు నిబంధనలు అమలులో ఉండేలా జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ ఉప కమిషన రు చర్యలు చేపట్టాలన్నారు. పోలింగ్‌ కేంద్రాలు నిర్వహించే నిర్వమించే విద్యాలయాలకు రె ండు రోజుల పాటు సెలవు దినాలుగా ప్రకటించడం జరిగందన్నారు. ఎన్నికల నియమ, నిబంధనలను తప్పక అమలు చేయాలని కలెక్టర్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2020-03-15T10:49:42+05:30 IST