స్థానిక సంస్థలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలి

ABN , First Publish Date - 2020-11-20T04:31:45+05:30 IST

రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు వెంటనే నిర్వహించాలని టీడీపీ కడప పార్లమెంట్‌ మహిళా అధ్యక్షురాలు శ్వేతశ్రీరెడ్డి పేర్కొన్నారు.

స్థానిక సంస్థలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలి

టీడీపీ కడప పార్లమెంట్‌ మహిళా అధ్యక్షురాలు శ్వేతశ్రీరెడ్డి

కాశినాయన నవంబరు19: రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు వెంటనే నిర్వహించాలని టీడీపీ కడప పార్లమెంట్‌ మహిళా అధ్యక్షురాలు శ్వేతశ్రీరెడ్డి పేర్కొన్నారు. గురువారం నర్సాపురంలోని టీడీపీ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్‌ ఎన్నికలు నిర్వహిస్తామని ముందుకు వస్తే, ప్రభుత్వం కరోనా సాకుతో ససేమిరా అనడం విచారకరమన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటీవ్‌ కేసులు బాగా తగ్గాయని, స్కూళ్లు తెరిచినప్పుడు లేని కరోనా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎందుకు అడ్డువస్తుందని ఆమె ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయని అక్కడలేని ఇబ్బందులు ఇక్కడే ఎందుకు వస్తున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభు త్వం స్పందించి పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు వెంటనే చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-11-20T04:31:45+05:30 IST