స్థానిక ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2020-03-12T07:31:35+05:30 IST

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్‌

స్థానిక ఎన్నికలు  పారదర్శకంగా నిర్వహించాలి

కడప (కలెక్టరేట్‌), మార్చి 11: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని వీడియోకాన్ఫరెన్స్‌ హాలులో జడ్పీటీ సీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి మాస్టర్‌ ట్రై నర్లకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భం గా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో మాస్టర్‌ ట్రైనర్లు ఎన్నికల సిబ్బందికి శిక్ష ణ ఇవ్వాలన్నారు. ఎన్నికల నియమావళి ని పాటిస్తూ అధికారులకు అప్పగించిన విధులను బాధ్యాతాయుతంగా పూర్తి చే యాలన్నారు.


ఈనెల 24వ తేదీన ఎంపీ టీసీ, జడ్పీటీసి ఎన్నికలు పూర్తవుతాయన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో మైక్రోఅబ్జర్వర్‌, సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక ఫ్లయింగ్‌స్క్వా డ్‌ను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 12వ తేదీన జోనల్‌ అధికారులకు శిక్షణ , 13న పీవో, ఏపీవోలకు శిక్షణ, నామినేషన్లల స్ర్కూట్నీ, 14న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. అదేరో జు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించడం జరుగుతుందన్నారు.


15, 16వ తేదీల్లో సర్వీస్‌ ఓటర్లు పోస్టల్‌ బ్యాలెట్లు డిస్పాచ్‌ చేయడం జరుగుతుందన్నారు. 18న పోలింగ్‌ కేంద్రాల వారీగా మెటీరియల్‌ పంపిణీ, 19న ఎలకో్ట్రరల్‌ కాపీమార్కు ప్రిపరేషన్‌, 21న పోలింగ్‌, 22న కౌంటింగ్‌ సిబ్బందికి శిక్షణ, 24న కౌంటింగ్‌ అయిపోయిన వెంటనే  ఫలితాలు ప్రకటించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌-2 శివారెడ్డి, సీపీవో తిప్పేస్వామి, తహసీల్దార్లు, మ్టార్‌ ట్రైనర్లు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-12T07:31:35+05:30 IST