లోకల్ బాడీ ఎన్నికలు పార దర్శకంగా జరగాలి
ABN , First Publish Date - 2020-02-08T10:15:49+05:30 IST
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నిష్పక్షపాతం గా, పారదర్శకంగా నిర్వహించడానికి సర్వం సి ద్ధం చేసుకోవాలని రాష్ట్ర

కడప (కలెక్టరేట్), ఫిబ్రవరి 7 : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నిష్పక్షపాతం గా, పారదర్శకంగా నిర్వహించడానికి సర్వం సి ద్ధం చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనరు డాక్టర్ రమే్‌షకుమార్ జిలా ్లకలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. శుక్రవారం రాజధాని అమరాతి నుంచి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర కమిషనరు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనరు మాట్లాడు తూ పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారు విషయంలో ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు తూచా తప్పక పాటించాలన్నారు. ఎన్నికల సమయంలో 10వ తరగతి, ఇంటర్మీడిట్ పరీక్షలు జరుగుతాయని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలింగ్ బూత్‌ల నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో రౌడీషీటర్స్, ట్రబుల్ మేకర్స్‌ను గుర్తించి నిఘా పెంచాలన్నారు. నోటిఫికేషన్ మొదలు కౌంటిం గ్ వరకు అవసరమైతే సెంట్రల్ పోలీసుతో ప్ర త్యేక బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు మేరకు ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని కలెక్టర్ హరికిర ణ్, రాష్ట్ర ఎన్నికల కమిషనరుకు వివరించారు. ఎలక్టోరల్ రోల్స్ తుది జాబితా జనవరి 27న ప్ర కటించడం జరిగిందని, జిల్లాలో 749 పోలింగ్ స్టేషన్లున్నాయని అన్నారు. 7.31 లక్షలు ఓటర్లకు గాను 1622 బ్యాలెట్ బాక్సులు అవసరమన్నారు. కొన్ని చోట్ల చేర్పులు మార్పులు కోరు తూ నివేదికలందాయని పరశీలిస్తామన్నారు. అనంతరం జిల్లా అధికారులతో కలెక్టరు మా ట్లాడుతూ ఈ ఎన్నికలకు జిల్లా నోడల్ అధికారిగా రెవెన్యూ అధికారి రఘునాథ్ వ్యవహరిస్తారన్నారు. ఈ ఎన్నికల లోటు పాట్లపై సందేహాలుంటే నోడల్ అధికారిని సంప్రదించాలాన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అన్బురాజన్, డీఆర్వో రఘునాథ్, కమిషనరు లవన్న, అన్ని మున్సిపాలిటీ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.