అక్రమ మద్యం వ్యాపారం గుట్టు రట్టు

ABN , First Publish Date - 2020-12-02T04:47:21+05:30 IST

గోవా నుంచి అక్రమంగా మద్యాన్ని తరలించి ఇక్కడ అమ్ముతున్న వారిని సంబేపల్లె పోలీసులు పట్టుకు న్నారని రాయచోటి డీఎస్పీ వాసుదేవన్‌ తెలిపారు.

అక్రమ మద్యం వ్యాపారం గుట్టు రట్టు
అక్రమ మద్యం, నిందితులతో పోలీసు అధికారులు

ముగ్గురి అరెస్టు 

41 ఫుల్‌ బాటిళ్లు స్వాధీనం


సంబేపల్లె, డిసెంబరు 1: గోవా నుంచి అక్రమంగా మద్యాన్ని తరలించి ఇక్కడ అమ్ముతున్న వారిని సంబేపల్లె పోలీసులు పట్టుకు న్నారని రాయచోటి డీఎస్పీ వాసుదేవన్‌ తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో డీఎస్పీ మా ట్లాడుతూ రాయచోటికి చెందిన నలుగురు యువకులు మనోహర్‌రెడ్డి, హరినాధ్‌రెడ్డి, సాయికిరణ్‌, మరో వ్యక్తి ద్విచక్రవాహనాల్లో మద్యం తరలిస్తూ మొతుకువాండ్లపల్లె క్రాస్‌ రోడ్డు వద్ద సంబేపల్లె పోలీసులకు పట్టుబడినట్లు తెలిపారు. వీరు గోవా నుంచి పెయింట్‌ డబ్బాల ద్వారా ఒక్కొక్క డబ్బాలో 50 ఫుల్‌ బాటిల్స్‌ ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్టు ద్వారా రాయచోటికి తరలించేవారన్నారు. బెంగుళూరులోని వైట్‌ ఫీల్డ్‌లో లేబుల్స్‌ తయారు చేసుకుని వాటిని మద్యం బాటిల్స్‌కు అంటించి రాయచోటి పరిసర ప్రాంతాల్లో వీటిని అధిక ధరలకు అమ్ముతున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఇదే తరహాలో అక్రమ మద్యంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైన వివరాలు కూడా సేకరించి విచారిస్తున్నట్లు కూడా తెలిపారు. వీరు ఒక బాటిల్‌ రూ.250 కొనుగోలు చేసి ఇక్కడ రూ.600 లెక్కన అమ్ముతున్నారన్నారు. ట్రాన్స్‌పోర్టుల ద్వారా కొత్త తరహాలో మద్యం అక్రమ వ్యాపారాన్ని చేస్తున్న వారిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సంబేపల్లె ఎస్‌ఐ రాజారమేష్‌, సీఐ లింగప్ప, పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. 

Updated Date - 2020-12-02T04:47:21+05:30 IST