వైరస్‌పై సైనికుల్లా పోరాడుదాం
ABN , First Publish Date - 2020-04-01T09:45:49+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సైనికుల్లా పోరా డుదామని ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం

రామాపురం, మార్చి 31: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సైనికుల్లా పోరా డుదామని ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం రామాపు రం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన అధికారుల సమీక్షా సమావేశంలో ఆయ న మాట్లాడుతూ కరోనా వైరస్ సమస్యాత్మకం గా ఉందన్నారు. సైనికుల్లా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రతి ఒక్కరూ మానవత్వంతో వ్యవహరించాలన్నారు.
అనంతరం విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి ఆయన మాస్కులను పంపిణీ చేశా రు. తహసీల్దార్ మహబూబ్‌చాంద్, ఎంపీడీఓ నరసింహులు, వైద్యాధికారి చంద్రశేఖర్, ఎస్‌ఐ మైఐనుద్దీన్, ఈఓపీఆర్‌డీ మల్లికార్జున, మండల అధికారులు, వైసీపీ నేతలు నాగభూషణ్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, యోగాంజుల్‌రెడ్డి, ఓబులేసు, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తదితర అభిమానులు పాల్గొన్నారు.