ప్రాణం పోయినా మైనింగ్‌ మాఫియాను సాగనివ్వం

ABN , First Publish Date - 2020-12-30T05:37:15+05:30 IST

ప్రాణం పోయినా మై నింగ్‌ మాఫియాను సాగ నివ్వ బోమని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు.

ప్రాణం పోయినా మైనింగ్‌ మాఫియాను సాగనివ్వం
సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

ముద్దనూరు డిసెంబరు 29: ప్రాణం పోయినా మై నింగ్‌ మాఫియాను సాగ నివ్వ బోమని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. చింతకుంట కొండల్లో మైనింగ్‌ జరుగకుండా అడ్డుకుంటానన్నారు. మండల పరిధిలోని చింతకుంట కొండ సమీపంలో మంగళవారం మూడు సిలికాన్‌ శాండ్‌ క్వారీకి సంబంధించి పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణను డివిజనల్‌ రెవెన్యూ అధికారి మలోల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హాజరయ్యారు. ముందుగా మైనింగ్‌ ప్రాంతంలో చేపడుతున్న పనులు, వాటి ముఖ్య ఉద్దేశ్యాలను మైనింగ్‌ కన్‌సల్డెంట్‌ చదవి వినిపించారు. అనం తరం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ కొండలో ఆదిమ మానవుడు నివసించినట్లు చరిత్రలో ఉందని, ప్రతి రాతి గుండుకు ఆదిమ మానవుడు చిత్రీకరించిన రేఖాచిత్రాలు ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేంకు కృషి చేస్తామన్నారు. మైనింగ్‌ మాఫియాను కొండలో తవ్వకాలు జరిపేందుకు అడుగుపెట్టనివ్వమన్నారు. మైనింగ్‌ యజమానులు జిలానిబాషా, పొన్నపురెడ్డి శివారెడ్డి మాట్లాడుతూ రేఖాచిత్రాలు తమ మైనింగ్‌ పరిధిలో లేవన్నారు. మైనింగ్‌ ద్వారా 50 నుంచి 100 మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ కింద ఏడాదికి రూ.10 లక్షలు, సోషల్‌ రెస్పాన్స్‌ కింద ఏడాదికి రూ.10లక్షలు, పాఠశాల అభివృద్ధికి సంబంధించి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. డివిజనల్‌ రెవెన్యూ అధికారి మలోల మాట్లాడుతూ రాత పూర్వకంగా వచ్చిన అర్జీలను పరిగణంలోకి తీసుకొని నివేదిక తయారు చేస్తామన్నారు. కాగా 350 మంది పోలీసు బలగాలు, ఇద్దరు అడిషనల్‌ డీఎస్పీలు రుషికేశవరెడ్డి, కాశింసాహెబ్‌, 5 మంది డీఎస్పీలు, జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, ఏడుగురు సీఐలు, ముద్దనూరు సీఐ హరినాథ్‌, 28 మంది ఎస్‌ఐలు 26 మంది ఏఎస్‌ఐలు, అలాగే  హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్లు, ష్పెషల్‌ పార్టీ పోలీసుల మధ్య పర్వావరణ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది.

Updated Date - 2020-12-30T05:37:15+05:30 IST