లీజు చెల్లించకుంటే స్థలాలు స్వాధీనం

ABN , First Publish Date - 2020-12-08T05:04:52+05:30 IST

అగస్త్యేశ్వరస్వామి ఆలయానికి చెందిన స్థలాల్లో ఉన్నవారు లీజు చెల్లించకుంటే వాటిని స్వాధీనం చేసుకుంటామని ఆలయ ఛైర్మన్‌ శెట్టిపల్లె రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

లీజు చెల్లించకుంటే స్థలాలు స్వాధీనం

ప్రొద్దుటూరు టౌన్‌, డిసెంబరు 7: అగస్త్యేశ్వరస్వామి ఆలయానికి చెందిన స్థలాల్లో ఉన్నవారు లీజు చెల్లించకుంటే వాటిని  స్వాధీనం చేసుకుంటామని ఆలయ ఛైర్మన్‌ శెట్టిపల్లె రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.  పాలకమండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినాయకనగర్‌లోని స్థలానికి పది రోజుల్లోపు లీజు కట్టాలని సూచించారు. లీజు కట్టని స్థలాలను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఈవో రామచంద్రాచార్యులు, సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-08T05:04:52+05:30 IST