ఆర్టీపీపీ సంగతి తేల్చండి : తులసిరెడ్డి
ABN , First Publish Date - 2020-08-22T11:46:01+05:30 IST
పారిశ్రామిక అభివృద్ధిలో భాగం గా ఆర్టీపీపీ సంగతి తేల్చాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
వేంపల్లె, ఆగస్టు 21: పారిశ్రామిక అభివృద్ధిలో భాగం గా ఆర్టీపీపీ సంగతి తేల్చాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేంపల్లెలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కడప వద్ద ఎలక్ర్టానిక్ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్‌ను ఏర్పాటు చే స్తామన్న ప్రభుత్వం మాటలు నమ్మశక్యంగా లేవన్నా రు. ఒకవైపు జిల్లాలో పరిశ్రమలను మూసివేస్తూ మరోవైపు కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తున్నారన్నారు. రాయలసీమ థర్మల్ పవర్‌ను మూసివేయాలనుకోవడం శోచనీయమన్నారు. 1650 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్న ఆర్టీపీపీ ఎన్నో అవార్డులు సొంతం చేసుకుందని, అలాంటి ఆర్టీపీపీని నిర్వీర్యం చేయాలనుకోవడం ఎంత వరకు సమంజసమన్నారు. ఉన్న పరిశ్రమలను మూసివేయకుండా కాపాడుకోలేని ప్రభుత్వం కొత్త పరిశ్రమాలు ఏర్పాటు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.