షార్ట్‌సర్క్యూట్‌తో లారీ దగ్ధం

ABN , First Publish Date - 2020-03-19T10:39:45+05:30 IST

కమలాపురం పట్టణంలోని రైల్వే గేటు వద్ద బుధవారం తెల్లవారు జామున షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా లారీ దగ్ధమైంది. మండల

షార్ట్‌సర్క్యూట్‌తో లారీ దగ్ధం

కమలాపురం, మార్చి 18 : కమలాపురం పట్టణంలోని రైల్వే గేటు వద్ద బుధవారం తెల్లవారు జామున షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా లారీ దగ్ధమైంది. మండల పరిధిలోని ఎర్రగుడి పాడుకు చెందిన చెన్నకేశవరెడ్డికి చెందిన ఫ్లయాష్‌ ట్యాంక ర్‌ నెల్లూరు నుంచి ఎర్రగుంట్లకు వస్తుండగా కమలాపురం రైల్వేగేటు వద్ద షార్ట్‌సర్క్యూట్‌ అయ్యి ఈప్రమాదం జరిగిం ది. మంటలు పెద్దగా వ్యాపించాయి.


చుట్టుపక్కల ఎటువం టి వాహనాలు, నివాస గృహాలు లేకపోవడంతో పెద్ద ప్రమా దం సంభవించలేదు. అయితే లారీలోని సిబ్బంది మంట లను అదుపు చేయలేకపోయారు. వెంటనే ఫైర్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే లారీలోని ఇంజను భాగం పూర్తిగా కాలిపోయింది. లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లినట్లు యజమాని తెలిపారు. 

Updated Date - 2020-03-19T10:39:45+05:30 IST