స్థలాన్ని పరిశీలించిన ‘అపాచి’ ప్రతినిధులు
ABN , First Publish Date - 2020-12-08T05:06:17+05:30 IST
అపాచి లెదర్ కంపెనీకి కేటాయించిన 27.94 ఎకరాల స్థలాన్ని సోమవారం పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి కంపెనీ ప్రతినిధులు పరిశీలించారు.

పులివెందుల టౌన్, డిసెంబరు 7: పులివెందులలో నిర్మించనున్న అపాచి లెదర్ కంపెనీకి కేటాయించిన 27.94 ఎకరాల స్థలాన్ని సోమవారం పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి కంపెనీ ప్రతినిధులు పరిశీలించారు.పులివెందులలో నిర్మించనున్న అపాచి లెదర్ కంపెనీకి కేటాయించిన 27.94 ఎకరాల స్థలాన్ని సోమవారం పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి కంపెనీ ప్రతినిధులు పరిశీలించారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన అడిదాస్ కంపెనీకి చెందిన అపాచి లెదర్ యూనిట్‌ను పులివెందులతో పాటు, శ్రీకాళహస్తి సమీపంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈనెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల పర్యటనలో శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారని, ఇక్కడ అపాచి లెదర్ కంపెనీ ఏర్పాటుతో దాదాపు 2 వేల మందికి ఉపాధి కలుగుతుందన్నారు. కార్యక్రమంలో అపాచి కంపెనీ ప్రతినిధులు స్పెషల్ అసిస్టెంట్లు సైమన్, హరియన్, వైస్ జీఎం ముత్తు గోవిందుస్వామి, సివిల్ ఇంజనీర్ గుణ, పీఆర్వో రాజారెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ జయలక్ష్మి, డీఐసీ జీఎం చాంద్‌బాష తదితరులు పాల్గొన్నారు.