‘ఆ భూములే మాకు జీవనాధారం’

ABN , First Publish Date - 2020-11-07T05:36:32+05:30 IST

కడప విమానాశ్రయం సమీపంలో ఉన్న భూములే తమకు ఆధారమని, కావున మార్కెట్‌ ధర చెల్లించాలని రైతులు కోరారు.

‘ఆ భూములే మాకు జీవనాధారం’

కడప (మారుతీనగర్‌), నవంబర్‌ 6: కడప విమానాశ్రయం సమీపంలో ఉన్న భూములే తమకు ఆధారమని, కావున మార్కెట్‌ ధర చెల్లించాలని రైతులు కోరారు. శుక్రవారం సబ్‌ కలెక్టర్‌ పృద్వితేజ్‌ను ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప కార్పొరేషన్‌ పరిధిలోని పాలంపల్లె, చెన్నూరు మండలంలోని చిన్నమాచుపల్లె పరిధిలో సుమారు 47.53సెంట్లకు నోటీసులు పంపించారన్నారు. సబ్‌ కలెక్టర్‌ను కలిసిన వారిలో ఆ ప్రాంత రైతులు జి.మన్‌మోహన్‌రెడ్డి, మధువర్ధన్‌రెడ్డి, పుట్లూరు రాజా, అమర్‌నాధ్‌రెడ్డి, జాకీర్‌, నాగిరెడ్డి, వెంకటకృష్ణయ్య తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-11-07T05:36:32+05:30 IST