జీవనక్రాంతితో మహిళల జీవితాల్లో వెలుగు

ABN , First Publish Date - 2020-12-11T05:13:26+05:30 IST

ప్రతి మహిళా లక్షాధికారి కావాలన్నదే లక్ష్యమని అందుకోసమే జగనన్న జీవనక్రాంతి పథకం ఏర్టాపు చేసినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు

జీవనక్రాంతితో మహిళల జీవితాల్లో వెలుగు

కడప(కలెక్టరేట్‌), డిసెంబరు 10: ప్రతి మహిళా లక్షాధికారి కావాలన్నదే లక్ష్యమని అందుకోసమే జగనన్న జీవనక్రాంతి పథకం ఏర్టాపు చేసినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.గురువారం తాడుపల్లి క్యాపు కార్యాలయం నుంచి వీడియా కాన్పెరెన్స్‌ ద్వారా జీవన క్రాంతి పథకం ద్వారా గొర్రెలు, పొట్టేళ్లు యూనిట్ల కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. కార్యక్రమానికి కలెక్టరేట్‌ వీసిహాలు నుంచి జిల్లా కలెక్టర్‌ సి.హరికిరణ్‌, రాష్ట్ర వ్యవసాయ సలమాదారులు అంబటి కృష్ణారెడ్డి, జేసీ గౌతమి, ధర్మ చంద్రారెడ్డి, వ్యవసాయ సలహామండలి చైర్మన్‌ సంబటూరు ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టర్‌ హరికిరణ్‌ అధికారులు, లబ్ధిదారులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రారంభించిన ఈ పథకం ద్వారా  ఒక్కో యూనిట్‌కు 5,6 నెలల వయసుగల 14 గొర్రె పిల్లలు, మేక పిల్లలతో పాటుఒక యవ్యనపు పొట్టేలు, లేదా మేక పోతును పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జగనన్న జీవన క్రాంతి మొదటి విడత మార్చి 2021 వరకు, రెండో విడత ఏప్రిల్‌ నుంచి ఆగస్టువరకు, మూడో విడత సెప్టెంబరు నుంచి డిసెంబరు వరకు కొనసాగుతుందన్నారు. ఇందులో బాగంగా కడప జిల్లాలో 20,591 మందికి జగనన్న జీవ క్రాంతి పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. మొదటి విడత కింద 1000 యూనిట్లు లక్ష్యం కాగా1039 యూనిట్లను బ్యాంకు లింకేజి ద్వారా, మరో 390 యూనిట్లను ఉన్నతి పథకం ద్వారా ఎంపిక చేయడం జరిగిదన్నారు. కార్యక్రమంలో  పశుసంవర్ధక శాక జేడి సత్యప్రకాష్‌, డిఆర్డిఏ పీడి మురళీ మనోహర్‌ లు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-11T05:13:26+05:30 IST