జాతీయ షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు కోడూరు విద్యార్థి

ABN , First Publish Date - 2020-12-28T05:21:35+05:30 IST

ఈనెల 1వ తేదీన భువనేశ్వర్‌లో స్పోర్ట్సు అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల కు రైల్వేకోడూరుకు చెందిన విద్యార్థి గొబ్బూరు విశ్వతేజ్‌ ఎంపికయ్యారు.

జాతీయ షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు కోడూరు విద్యార్థి

రైల్వేకోడూరు, డిసెంబరు, 27: ఈనెల 1వ తేదీన భువనేశ్వర్‌లో స్పోర్ట్సు అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి షటిల్‌ బ్యాడ్మింటన్‌ పోటీల కు రైల్వేకోడూరుకు చెందిన విద్యార్థి గొబ్బూరు విశ్వతేజ్‌ ఎంపికయ్యారు. స్థానిక సిల్వర్‌ బెల్స్‌ స్కూలులో 9వ తరగతి చదువుతున్న ఇతను ఈనెల 30న భువనేశ్వర్‌లో నిర్వహించే శిక్షణకు వెళ్లనున్నట్లు పాఠశాల వర్గాలు  తెలిపాయి. ఈ సందర్భంగా విశ్వతేజ్‌ను రైల్వేకోడూరు ఫ్రెండ్సు క్లబ్‌ నిర్వాహకులు తులసి చంద్రశేఖర్‌, జీవీ రాజు, వీవీ క్రిష్ణ, ప్రముఖ వైద్యులు భాస్కర్‌రాజు, ఏవీ రత్నం సత్కరించారు. ఈ సందర్భంగా   విశ్వతేజ్‌ తండ్రి గొబ్బూరు నరేంద్ర మాట్లాడుతూ చిన్నతనం నుంచే తన కుమారుడు షటిల్‌ క్రీడ పట్ల ప్రతిభ కనబరుస్తున్నాడన్నారు.  


Updated Date - 2020-12-28T05:21:35+05:30 IST